సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు

Spread the love

సాక్షితసికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు సాధిస్తున్నామని, ఆయా పనుల్లో జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. రానున్న వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని అయన అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో అభివృధి కార్యకలాపాల పై శుక్రవారం సమక్షా సమావేశం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరుగుతున్న తీరును సంబందిత అధికారుల ద్వారా పద్మారావు గౌడ్ అడిగితెలుసుకొనే, వాటి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర మునిసిపల్ మంత్రి ని సంప్రదించి దాదాపు రూ.56 కోట్ల మేరకు నిధులను బల్దియా, జలమండలి ద్వారా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యకలాపాలకు మంజూరు చేయించినట్లు వివరించారు.

ప్రజలకు ఇవ్వని హామీలను కుడా నెరవేర్చిన ఘనత తమదని, 50 సంవత్సరాల్లో చేపట్టని పనులను ప్రారంభించామని తెలిపారు. సీతాఫల్మండి ప్రభుత్వ స్కూల్ లో జూనియర్, డిగ్రీ కాలేజీలను తామే ఏర్పాటు చేయించడంతో పాటు కొత్త భవనాలను కుడా ప్రారంభించమని తెలిపారు. మెట్టుగూడ, మనికేశ్వరి నగర్ లలలో కొత్తగా రూ.50 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న రెండు రైల్వే వంతెనల నిర్మాణం పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, స్థలాలు కోల్పోయిన వారికీ ఇచ్చే పరిహారం పై ప్రభుత్వం తో చర్చిస్తామని తెలిపారు. లాలాపేట లో రూ.ఆరు కోట్లతో కొత్త స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తీ చేస్తామని లాలాపేట లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ అధికారులను కోరారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి, రాసురి సునిత, కంది శైలజ , తెరాస యువనాయకులు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ దశరద్, ఎం ఆర్ ఓ లు మాధవి, ఆయప్ప, ఈ ఈ ఆశా లత, జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజెర్ వై. కృష్ణ, అధికారులు మహేష్, మాధవి, గంగాధర్, ముంతాజ్, లతో పాటు ghmc లోని అన్ని విభాగాలు, ట్రాన్స్ కో, రెవిన్యూ, జలమండలి, హౌసింగ్, వైద్య ఆరోగ్య శాఖ వంటి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page