ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు

Spread the love
Planned development works

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు


ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం
– ప్రతి గడపకు సంక్షేమ పథకాలు తీసుకెళ్లాం
– ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
– 16వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం

సాక్షిత : అనంతపురం నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. నగరంలోని 16వ డివిజన్‌లో కన్వీనర్‌ సుకేష్‌తో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి ఇంటికి వివరించారు.

బుక్‌లెట్లు అందజేస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించారు. అనంతరం ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు.

చెప్పిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, కానీ తాము అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎలా చేరువ అవుతున్నాయో తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం కూడా ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలతో పాటు ఇతర నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వసీం, కమిషనర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page