మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు సుబ్బారావు గారితో మర్యాద పూర్వకంగా కలిసిన 1వ డివిజన్ ఎపిఆర్ ప్రణవ్ అంటిలా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా ఇటీవలే భారీ వర్షం కారణంగా వారి ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రహరీ గోడను తొలగించిన నేపథ్యంలో తిరిగి ప్రహరీ గోడను నిర్మించగలరని,అదేవిధంగా పలు మౌలిక సదుపాయాల రూప కల్పన గురించి కృషి చేయగలరని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ సానుకూలంగా స్పందిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎల్లపుడూ కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక అసోసియేషన్ సభ్యులు సురేష్,భారతి,లక్ష్మిరమణ,ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.