SAKSHITHA NEWS

ఎన్ ఎమ్ అర్ యువసేన లో చేరిన 200 మంది కాలనీ వాసులు…
సబండవర్గాల ధర్మపోరాటంలో మేము సైతం కలిసి నడుస్తామని వెల్లడి…
ఏకే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదిర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు…

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ కు బహుజన సబ్బండ వర్గాల మద్దతు రోజురోజుకు పెరుగుతుంది.


రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన 200 మంది కాలనీ వాసులు నీలం మదుకు జై కొట్టారు. ఏకే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన ప్రజలు రామచంద్రపురం లోని రాయల్ మదీనా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నీలం మధు ముదిరాజ్ సమక్షంలో ఎన్ ఎం అర్ యువసేన లో చేరారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను సాదరంగా ఎన్ ఎం అర్ యువసేనలోకి ఆహ్వానించారు. సమావేశంలోని ప్రజలు నీలం మధు అడుగులో అడుగై కదిలి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని నినాదాలు చేశారు.


అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రామచంద్ర పురానికి చెందిన కాలనీవాసులు పెద్ద ఎత్తున తనకు మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం చేయడమే లక్ష్యంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. గత నాలుగు ఏళ్లుగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నా సేవలను గుర్తించి ప్రజలంతా నాతో నడిచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అదేశించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల మద్దతుతో ఈనెల 16 నుంచి పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పాదయాత్రకు మీరంతా కదలివచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. గత నాలుగేళ్లుగా ప్రతిక్షణం తన మిత్రుడిగా వెంట ఉంటూ సంపూర్ణ సహకారం అందిస్తున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదిర్ సేవలను జీవితాంతం గుర్తించుకుంటానన్నారు. మన పోరాటాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన సారథ్యంలో ఇంత పెద్ద ఎత్తున యువత యువసేనలో చేరడం గర్వంగా ఉందన్నారు. ప్రజలిచ్చిన స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఖాలీల్ పాషా, అబ్దుల్ నిసార్, ఇనాయత్, అంజద్, అమిత్, ఇలియాస్, ఫాతిమా బేగం, సత్యవతి, కిషోర్, సాయి కిరణ్, గణేష్,శివ, సాయి కృష్ణ,మహేష్,రవి,కృష్ణ, చింటూ, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 13 At 6.04.41 Pm

SAKSHITHA NEWS