People should be alert in the wake of the storm
తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
*టోల్ ఫ్రీ నంబర్ 0877-2256766
*డ్రైనేజీ కాలువల్లో ఎక్కడా చెత్త లేకుండా తొలగించండి.
*కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత *తిరుపతి : తుఫాను నేపథ్యంలో తిరుపతి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 0877-2256766 ను సంప్రదిస్తే తమ సిబ్బంది వెంటనే సాయం అందిస్తారని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
తుఫాన్ కారణంగా శుక్రవారం ఉదయం వర్షాలు కురుస్తుండటంతో ఇంజినీరింగ్, శానిటేషన్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ నగరంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
ఆటోనగర్, గొల్లవాణిగుంట, కొరమేనుగుంట, నారాయణ పురం, వై.ఎస్.ఆర్.మార్గ్, కట్టకిందపల్లి, రాయలచెరువు రోడ్డు, వెంగమాంబ కూడలి వద్ద నున్న రైల్వే అండర్ బ్రిడ్జి లను, పెద్ద కాలువలను వర్షంలోనే పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ మాట్లాడుతూ రానున్న రెండు రోజుల పాటు పడుతున్న భారీ వర్షాలను దృష్టిలో వుంచుకొని నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.
అలాగే ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆయా వార్డుల్లో ఉండేలా డ్యూటీలు కూడా వేయడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాలు, పెద్ద కాలువలు వద్ద పర్యవేక్షణ చేసామని, ఎక్కడ కూడా కాలువల్లో చెత్త లేకుండా తొలగించేందుకు జేసిబి లను అందుబాటులో ఉంచి, అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటికే పెద్ద కాలువల్లో వర్షం వలన తగులుకున్న చెత్తను దాదాపుగా తొలగించడం జరిగిందన్నారు.
అలాగే పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా, వైధ్య సదుపాయం అందుబాటులో వుండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మంచినీళ్ల కుంట మరమ్మతులు చేయాలని కార్పొరేటర్ నరసింహాచారి కమిషనర్ ను కోరగా పరిశీలించి పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డి.ఈ. లు సంజయ్ కుమార్, మహేష్, కార్యదర్సులు ఉన్నారు. అదేవిధంగ వర్షంలో పని చేస్తున్న అధికారులను ఎప్పటికప్పుడు కమిషనర్ మాట్లాడుతూ తగు సూచనలు చేయడం జరిగింది.