పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తా

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తా

SAKSHITHA NEWS

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తా : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 126- జగద్గిరిగుట్ట డివిజన్ మైసమ్మ నగర్ – బి సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి కాలనీలో సీసీ రోడ్డు పనులను చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని తెలియజేశారు. గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో కాలనీలను, మురికి వాడాలను రాజకీయాలకు అతీతంగా “మన ప్రాంత అభివృధ్ధి – మన అభివృద్ధి” అనే ఒకే ఒక నినాదంతో అభివృద్ధి చేశామని ఇందులో భాగంగా మైసమ్మ నగర్ లో దాదాపు అన్ని అభివృద్ధి పనులు చేపట్టామని ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు మిగిలిపోయినట్లయితే త్వరలోనే చేపడతామన్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ బొడ్రాయి (నాభిశిల) గ్రామదేవత పునః ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యే ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మైసమ్మ నగర్ ఏ అండ్ బి బ్లాక్ అధ్యక్షులు బ్రహ్మానందం చారి, పిల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శులు ముఖేష్ నేత, బండారు రవీందర్ రెడ్డి, కోశాధికారి జమేదార్ సంతోష్, కమిటీ సభ్యులు పాపిరెడ్డి, కే రాములు, రమేష్ .అప్పారెడ్డి, నరేష్ కుమార్, రాజిరెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తా

SAKSHITHA NEWS