SAKSHITHA NEWS

పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి – యస్.పి కె అపూర్వ రావు

— కోర్టు తీర్పులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి.

— నకిలీ విత్తనాల నివారణ పై ప్రత్యేక నిఘా

–విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా యస్.పి అపూర్వరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో యస్.పి అపూర్వ రావు నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను అరికట్టాలని, అక్రమ గంజా రవాణా, పేకాట, మట్కాలను అరికట్టాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట గస్తి బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు.వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా, నకిలీ విత్తనాలు నివారణ పైన నిఘా పెడుతూ రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పి.డి యాక్ట్ కేసులు నమోదు చేయబడుతాయని అన్నారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాధ్ రావు,డిఎస్పీ లు నరసింహ రెడ్డి, వెంకటగిరి, నాగేశ్వర రావు,రమేష్,సిఐ లు మరియు యస్.ఐలు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 05 24 at 8.39.12 PM

SAKSHITHA NEWS