పేద పూర్వ విద్యార్థి వివాహానికి చేయూత

Spread the love

పేద పూర్వ విద్యార్థి వివాహానికి చేయూత…..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం జిల్లా రూరల్ అధ్యక్షులు మొహమ్మద్ ముజీబ్ తను ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కేజీ సిరిపురం పాఠశాలలో చదివిన విద్యార్థి ఎస్కే రేష్మ యొక్క ముష్టికుంటలో జరిగిన వివాహానికి హాజరై డబుల్ కాట్ మంచం తో పాటు పరుపు మరియు 6500 విలువగల వంట సామాన్లు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక తోడ్పాటు అందించిన బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల జమాత్ బాధ్యులు షేక్ మహబూబ్ పాషా, ముష్టికుంట మసీదు అధ్యక్షులు షేక్ ఇబ్రహీం గ్రామ పెద్దలు షేక్ రఫీ, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page