రాబోయే ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ కే

Spread the love

ఏకగ్రీవ తీర్మానం చేసిన తీర్మానం పత్రం ను జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ సగర (ఉప్పర) సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాంధీ కి అందచేయడం జరిగినది

జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ సగర (ఉప్పర) సంఘం వారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కి సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ ఏకగ్రీవ తీర్మానం పత్రం ను మాజీ కార్పొరేటర్ మాధవర రంగరావు తో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కి వివేకానంద నగర్ లోని వారి నివాసంలో అందచేసిన సగర(ఉప్పర) సంఘం సభ్యులు


  • ఈ సందర్భంగా సగర సంఘం సభ్యులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీ కే ఉంటుంది అని , ఏకగ్రీవ తీర్మానం అందచేయడం జరిగినది అని,గాంధీ కి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తాం అని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. మేము అంతా ఐక్యం గా ఉండి బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉంటాం అని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం కృషి చేస్తాం అని,నిత్యం అందుబాటులో ఉండి ,మాకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలుగా అండగా ఉంటారు అని, శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అనేక అబివృద్ది కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కృషి చేశారని ,మంచి మనసున్న వ్యక్తి ఆరెకపూడి గాంధీ ని మళ్ళీ గెలిపించుకుంటాం అని సగర సంఘం నాయకులు ముక్తకంఠంతో తెలియచేసారు.

ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని,ముఖ్య మంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మహిళ పక్షపాతి ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ గారిదేనని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు ,హైదరాబాద్ ను విశ్వనగరం గా తీర్చి దిద్దే క్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మౌలిక వసతుల కల్పనకై ముఖ్య మంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో IT రంగం , అతి పెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివాసిస్తున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో ముఖ్య మంత్రి KCR దూర దృష్టితో మరియు మంత్రి KTR ప్రణాళికలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి SRDP ప్రాజెక్ట్ ద్వారా సాఫీగా ప్రయాణాలు సాగె విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యం తో SRDP ప్రాజెక్ట్ లో భాగంగా తొలి ఫలితం అయిన అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించడం జరిగినది అని, SRDP లో 10 పనులకు గాను 9 పనులు పూర్తి అయినవి అని, మరొకటి పురోగతిలో ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ప్రత్యమ్నాయ రోడ్లు ,ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు కొత్త ప్రతిపాదనల తో బ్రహ్మాండంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోకూడా అధికారులు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని,ఎక్కడ పనులు ఆపకుండా ఎన్నో స్థల సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రజల సహకారం తీసుకోని అధికారులను సమన్వయ పర్చుకుంటూ ఇన్ని రోడ్లు అభివృద్ధి చేయడం అంటే బహుశా 50 యేండ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి సరిగా గొప్ప చరిత్ర అని చెప్పుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ,మాకు చాలా గౌరవంగా ఉందని చెప్పడానికి చాల సంతోషిస్తున్నాను అని ,అదేవిధంగా బ్రహ్మాండంగా ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేయడం జరిగినది .చాల సంతోషంగా ఉంది అని , ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి KTR కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు..

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ సగర (ఉప్పర) సంఘం అధ్యక్షులు దయాసాగర్, ప్రధాన కార్యదర్శి అస్కాని శ్రీనివాస్ సాగర్, కోశాధికారి వేముల సుదర్శన్, సాగర్, కె.పి రాములు సాగర్, రాము సాగర్, గిన్నె భీమయ్య సాగర్ ,ఎం. రాములు సాగర్, రామకృష్ణ సాగర్, గిన్నె రాము సాగర్, చంద్రమోహన్ సాగర్, తిరుపతమ్మ సాగర్, శాంతా సాగర్ పెద్ద మొత్తంలో సగర సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది

Whatsapp Image 2023 11 13 At 3.26.06 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page