ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే మన ముఖ్యమంత్రి జగన్ !!
— మంత్రి జోగి రమేష్
సాక్షిత : పలు సంక్షేమ పథకాల ప్రదాత, విద్యా సంస్కరణల ఆద్యుడు ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. పెడన టౌన్ పరిధిలో 2 వ సచివాలయం పరిధిలోని 4, 5 వార్డులలో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన వెంట పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.
తొలుత మంత్రి జోగి రమేష్ స్థానిక 4 వ వార్డు పెద్ద మసీదు ప్రాంతం, జండా వీధి, తామరచెరువు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. నేషనల్ ఫౌండ్రీ అధినేత ఎండి హుస్సేన్ అనారోగ్యంకు గురయ్యారని తెలుసుకొని ఆయనను ముందుగా పరామర్శించారు. గబిరి, అక్బర్ బాషా, ఎం.డి జకీరా, మహమ్మద్ ఆయుబ్, అబ్దుల్ రఖాబా, షేక్ అల్లాబక్షు, హమీరున్నీసా, టైలర్ బాబు, కరీం బేగ్, ఎండి ఉస్మాన్, తదితరుల ఇంటికి వెళ్లి మంత్రి జోగి రమేష్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న మేళ్లను వివరించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి తెలిపారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని పెడన పట్టణవాసులు చెబుతున్నారు.
మంత్రి జోగి రమేష్ ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీసి, ఏయే పథకాలతో ఎంత లబ్ధి పొందారో వివరిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వతహాగా రాసిన లేఖను, నవరత్నాల బుక్‌లెట్‌ను అందించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ సహాయాన్ని తెలియ చేస్తూ, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. అర్హులకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనని మంత్రి జోగి రమేష్ భరోసా కల్పించారు. ఆయన సందర్శిస్తున్న ప్రతీ గడపలో ప్రజలను పేరు పెట్టీ మరీ ఆప్యాయంగా పలకరిస్తూ, మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డికి మీ దీవెనలు అందించాలని స్థానిక ప్రజలకు మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఏ ఒక్కరి పార్టీ, కులం, మతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికి మేలు జరగాలని చూస్తున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, వైస్ చైర్మన్ మహమ్మద్ ఖాజా, 4 వార్డ్ కౌన్సిలర్ రెహేతున్నిసా,3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన తహసీల్దార్ మధుసూధనరావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, ఆహార సలహా కమిటీ చైర్మన్ అనీఫ్ ఖాన్, ఆయుబ్ ఖాన్ అమిద్ ఖాన్ మతిన్ ఖాన్ వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు- సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు ..