ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి మండలంలో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని లోని పాపిరెడ్డినగర్ కాలనీ లో దరఖాస్తు చేసుకున్న వారికి GO . NO . 59 ద్వారా యజమాని హక్కుల ను కలిపిస్తూ అర్హులైన 22 మంది లబ్ధిదారులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో నెంబర్ 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా 59 జి.ఓ కింద ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని సైతం పొందారు.

ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న స్థల వివాదాలు సమస్యలో పేద మధ్య తరగతి కుటుంబాలు మరియు నివసిస్తున్న స్థలాలకు కూడా యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నాయకత్వంలో ఇది ఒక గొప్ప అవకాశం కలిపించింది అని ఈ అవకాశాని వినియోగించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పేద మధ్య తరగతి కుటుంబాలలో కనిపిస్తున్నా సంతోషం మాటలో చెప్పలేనిదని తెలియజేసారు సంక్షేమం అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల సంఖ్య కాదు పేద కుటుంబాలలో కనిపించే ఆనందం అని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరుకు తెలంగాణ ప్రజల జీవన విధానంలో మెరుగైన జీవనాన్ని అందించడానికి చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శం అని ప్రభుత్వ విప్ గాంధీ గారూప్ తెలియజేసారు

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి , కాశినాథ్ యాదవ్ ,గుడ్ల శ్రీనివాస్, ఆర్ భగవంతు రెడ్డి, నరసింహులు ముదిరాజ్, సిహెచ్ రామకృష్ణారెడ్డి, ఎం కనక రెడ్డి, వీరభాస్కర్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, శ్రీహరి, మోహన్ , V. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page