SAKSHITHA NEWS

తొక్కిసలాటలో ఒకరు…బస్సు కిందపడి మరొకరు మృతి

మృతి చెందిన వ్యక్తికి10 లక్షల తక్షణ సహాయం అందించాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల :

జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ ’సిద్ధం‘ సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒంగోలు బలరాం కాలనీకి చెందిన మురళీ‌గా గుర్తించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కాగా ఈ ఘటనతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టినట్టు సమాచారం. ఈ విషయం ప్రతిపక్ష నేతలకు తెలియడంతో వారు కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తొక్కిసలాటలో ఒకరు, బస్సు కిందపడి మరొకరు మృతి : బాపట్ల జిల్లా మేదరమెట్లలో సాయంత్రం జరిగిన వైసీపీ ‘సిద్ధం’ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం జగన్‌ సభాస్థలికి చేరుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఉదరగుడి మురళి (30) మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభకు హాజరై తిరిగి వస్తుండగా బస్సు ముందు డోర్‌ వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు సభలో ఓ ఏఎస్సైకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

WhatsApp Image 2024 03 11 at 8.43.48 AM

SAKSHITHA NEWS