12 న రాజుపాలెం నుండి సత్తెనపల్లి మీదుగా రోడ్ షో
24న నామినేషన్ దాఖలు:
ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయండి
వైయస్సార్ సిపి శ్రేణులకు మంత్రి అంబటి పిలుపు
రాజుపాలెం
ఈనెల 10వ తేదీన పిడుగురాళ్ల బైపాస్ వద్ద యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మేమంతా సిద్ధం ” బహిరంగ సభ జరుగుతుందని, 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని, ఈనెల 24వ తేదీన సత్తెనపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మాత్యులు అంబటి రాంబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం కొండమోడులోని వల్లెల గార్డెన్స్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ప్రాథమిక సమాచారం మేరకు మూడు రోజుల పాటు మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. మేమంతా సిద్ధం బహిరంగ సభ చాలా కీలకమైనది సిద్ధం సభలు ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేశాయో, అదే స్థాయిలో మేమంతా సిద్ధం సభలు కూడా క్షేత్రస్థాయి నుంచి కీలక నాయకులను రానున్న ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు ఈ సభలు దోహదపడుతున్నాయన్నారు. ప్రతి ఒక్క నాయకుడు దృఢ సంకల్పంతో ఈ సభలను విజయవంతం చేసేందుకు, రానున్న ఎన్నికల్లో ఇక్కడ నన్ను , పార్లమెంటులో అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించి ఫ్యాను గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మీరందరూ సహకరించాలన్నారు. కొండమోడు , నెమలిపురి ప్రాంతం గతంలో ఉమ్మడిగా పంచాయతీగా ఉండేదని, చిన్న పంచాయతీ ఏర్పాటు చేస్తే అభివృద్ధికి దోహదపడుతూనే ఉద్దేశంతో కొండమోడును పంచాయతీగా చేశామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు చేసిన మేలులను,ప్రజా సంక్షేమాన్ని , ముఖ్యమంత్రి అందించిన సంస్కరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని వివరించారు.
మీరంతా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులని 10 మందిని ప్రభావితం చేసి చైతన్యం చేసి వారని వైయస్సార్సీపి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా మీరు ప్రోత్సహించాలన్నారు. ప్రతిపక్షాలు నన్ను ఓడించేందుకే అన్ని శక్తులు ఒడ్డుతున్నాయని, ఆయా నేతలపై నేను ఎక్కువగా వైఎస్ఆర్సిపి తరఫున విమర్శిస్తాను కాబట్టే నన్ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. వైయస్ అనుచరుడిగా ఆయన వెంట నడిచానని, ఇప్పుడు జగన్ కు విధేయుడుగా ఉన్నానని అవసరాల కోసం, అధికారి కోసం పార్టీలు మారలేదని వివరించారు. రానున్న ఎన్నికల్లో బాధ్యతాయుతంగా పనిచేసే గతంలో కంటే మెరుగైన మెజార్టీని అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు , వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు