SAKSHITHA NEWS

ఇసుక తక్కువ డస్ట్ ఎక్కువ

— ఇష్టం వచ్చినట్లు సిసి రోడ్ల నిర్మాణం

-సీసీ రోడ్లలో నిబంధనలను పాటించని కాంట్రాక్టర్లు

నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోని అధికారులు

నిర్మాణ సమయంలో పర్యవేక్షణ చేయని సంబంధిత అధికారులు

సాక్షిత. నల్లగొండ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ,మురికి కాలువలు నిర్మాణం చేపడుతుంది. ముఖ్యంగా నూతనంగా ఏర్పాటు అయిన చిట్యాల మున్సిపాలిటీ అన్ని రంగాలలో అద్భుత ప్రగతి సాధిస్తూ జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న కానీ పట్టణంలో మొదటి వార్డు అయిన శివనేనిగూడెం లో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేయడం విడ్డూరంగా ఉంధి. రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు కాంట్రాక్టులు చేసుకుంటామని చెప్పి నిధులు మంజూరు చేయించుకుని పర్సంటేజ్ లకు ఇతరులకు పనులు ఇవ్వడంతో నాణ్యత లేకుండా పనులు పూర్తిగా లోపించి పోతున్నాయి. ప్రజా ప్రతినిధులు అధికారులతో కుమ్మక్కై పర్సంటేజ్ లకే పరిమితమై పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ లేకుండా ఎలాంటి నాణ్యత లేకుండా పనులు పూర్తి చేసినా కూడా ఎం బి లు ఇవ్వడం జరుగుతుంది.
చిట్యాల మున్సిపాలిటీ పరిధి విషయానికి వస్తే టి యు ఎఫ్ ఐ డి సి కింద మూడు కోట్లు నిధులు మంజూరు చేసి ప్రతి వార్డులో సీసీ రోడ్లు వేయడానికి నిధులు మంజూరు చేసినారు అట్టి నిధుల పనులు జరుగుతున్నాయి అట్టి పనుల్లో నాణ్యత లేకుండా, కాంట్రాక్టర్లు క్వాలిటీ లేకుండా పనులు చేస్తున్నారు.సిసి రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు డస్ట్ ఎక్కువగా కలుపుతూ ఇసుక తక్కువ వాడడం వల్ల వేసిన రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నాణ్యత పాటించాలని
సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై
ఏ ఈ గౌతం ని వివరణ కోరగా
రోడ్డు నిర్మాణం నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గరుండి పనులని పర్యవేక్షిస్తున్నాడని తెలిపారు.
మరి నిర్మాణంలో ఇసుక తక్కువ, డస్ట్ ఎక్కువ ఎవరు వాడుతున్నారో అధికారులకే తెలియాలి.


SAKSHITHA NEWS