SAKSHITHA NEWS

Officials should work in coordination in Jagananna structures

జగనన్న నిర్మాణాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి – కమిషనర్ అనుపమ అంజలి

తిరుపతి అర్బన్ అర్హులైన ప్రజలకు కేటాయించిన జగనన్న ఇంటి నిర్మాణాలు వేగవంతం చేసేందుకు హౌసింగ్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మునిసిపల్ ఇంజనీర్ అధికారులు, హౌసింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలు పూర్తి కావాలంటె అధికారులు అంతా కలిసి సమన్వయ నిర్ణయాలు తీసుకొని ముందుకెల్లాలని సూచించారు.

బేస్ మెంట్లు పూర్తి అయిపోయిన నిర్మాణాలకు అధిక సంఖ్యలో కావల్సిన ఇటుకలను పెద్ద మొత్తంలో సరఫరా చేసేందుకు వున్నటువంటి ఇటుకల ప్యాక్టరీల వివరాలను హౌసింగ్ అధికారులు సిద్దం చేసి త్వరగా అందించాలని ఆదేశించారు. వీలైనంత వరకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టిన లే అవుట్లకు దగ్గరగా వుండే ఇటుకల సరఫరా కేంద్రాలను సంప్రదించాలన్నారు.

ఇటుకలు సరఫరా జరిగిన వెంటనే ఆలస్యం కాకుండా గోడలను పూర్తి చేసేందుకు తమ సిబ్బందితో ఇంజనీరింగ్ అధికారులు సంసిద్దంగా వుండాలని కమిషనర్ అనుపమ అంజలి సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హౌసింగ్ డిఈ శ్రీరాములు, మునిసిపల్ డిఈలు రవీంధ్రరెడ్డి, గోమతి, దేవిక, సంజయ్ కుమార్, మహేష్, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS