హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్-మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు
మాజీ మంత్రి, మేడ్చల్ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు
Related Posts
కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న
SAKSHITHA NEWS కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ★ సినీ తార డింపుల్ హయతి ★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో కీర్తి…
ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1
SAKSHITHA NEWS ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1 హైదరాబాద్:ఫార్మూలా -ఈ కారు రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఈ…