మల్లంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూన కృష్ణ గౌడ్ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ రాత పుస్తకాలు, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను అందజేశారు.
ఈ సందర్బంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తుంటే.. అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించారని ఆయన మండిపడ్డారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సైతం ఫోన్లు చేసి పుస్తకాల పంపిణీని అడ్డుకోవాలని ఆదేశాల జారీ చేశారు. పేద విద్యార్థుల కొరకు శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు బ్రహ్మరథం పట్టరాని తెలిపారు. పేద విద్యార్థులకు అండగా ఉండడమే తమ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తొమ్మిదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసాడని.. గతంలో కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేసిన అభివృద్ధి పనులేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెండ్లి మడుగుల శ్రీనివాస్ గౌడ్, గణేష్, డా.శ్రీనివాస్ గౌడ్, విజయ్, సాయికృష్ణ రెడ్డి, లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.