గాజులరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; గాజులరామారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ రాత పుస్తకాలు, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను అందజేశారు. ఈ సందర్బంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తన సోదరుడు కూన శ్రీశైలం గౌడ్ ప్రభుత్వ బడిలో చదివి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికే మొట్టమొదటి ఎమ్మెల్యే అయ్యాడని.. ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు. కన్న తల్లిదండ్రులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికి మరవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం అన్న కుటుంబం చాల పెద్దదని.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబ సభ్యులేనని అన్నారు. పేద విద్యార్థుల చదువుల కొరకు తమ ట్రస్ట్ ఎల్లపుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్తారమ్మ ఆలయ కమిటి చైర్మన్ అంతయ్య గౌడ్, జనరల్ సెక్రటరీ బాలరాజు, స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, సాయినాథ్ నేత, రేవతి రెడ్డి, రాజిరెడ్డి, యాము, వర్మ, జ్ఞానీ, టైసన్, మురళి, నరేందర్ రెడ్డి, గంగారాం, లక్ష్మణ్, జహంగీర్, శ్రీనివాస్, యశ్వంత్, రమేష్, గిరి, ఆంజనేయులు, ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.