హైదరాబాద్:-బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్‌ఎస్ నేత నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేస్తామని వెల్లడించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ అటకెక్కించిందని, రైతుభరోసా ఆగిపోయిందని చెప్పారు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి పథకాల ఊసెత్తడం లేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసి తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు ఆగిపోయింది.. తాగునీటికి కరువు వచ్చిందని విమర్శించారు. పదేండ్లలో పచ్చబడ్డ పాలమూరు మళ్లీ బీడు భూములతో దర్శనమిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు కోతలతో రైతులు తల్లడితున్నారని చెప్పారు. అర్ధరాత్రి కరెంటు కోసం రైతులు నిద్రకాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించాలన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP