SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లోని వరుణ్ మోటార్స్ షో రూమ్ లో నూతన SWIFT DZIRE కారు ను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్విఫ్ట్ డిజయిర్ అన్ని హంగులతో , సరికొత్త ఫీచర్స్ తో నేడు మార్కెట్ లో కి రావడం అభినందనియం అని, సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడం, కస్టమర్ల అభిరుచికనుగుణంగా , మార్కెట్ పోటీతత్వంలో తీర్చిదిద్దడం, స్విఫ్ట్ డిజయిర్ కార్ లోఎలక్ట్రిక్ సన్ రూఫ్ , 9 ఇంచ్ టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా , వైర్ లెస్ ఛార్జర్ , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్ , పెట్రోలియం మరియు CNG సదుపాయం వంటి ఫీచర్స్ కలవు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ప్రసాద్, పోతుల రాజేందర్, సత్యనారాయణ, MD ఇబ్రహీం, MD అష్రాఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.