March 1 New Rules : నుంచి అమలుకానున్న కొత్త రూల్స్..

Spread the love

ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..

మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పిజి సిలిండర్ ధరలో మార్పు ఉంటుంది. రేపు కూడా వాటి ధరల్లో మార్పు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ఎల్‌పిజి సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరి చూపు ఎల్‌పీజీ సిలిండర్ల కొత్త ధరలపైనే ఉంది. ప్రస్తుతం దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ అంటే 14.2 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1053గా ఉంది.. అంటే స్వల్పంగా ధరలు పెరిగాయి..

ఫాస్టాగ్ ద్వారా టోల్ ట్యాక్స్ చెల్లిస్తే, ఈరోజే మీకు చివరి అవకాశం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ KYCని తప్పనిసరి చేసింది. దీని అప్డేట్స్ నిన్నటితో ముగిసింది.. ఈరోజు నుంచి ట్యాక్స్ కూడా కట్ అవుతుందని చెబుతున్నారు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం కు సంబందించిన కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురాబోతుంది.. మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. తొలుత ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ పొడిగించింది…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది.. కొత్త రూల్స్ ఈనెల 15 నుంచి అమల్లోకి వస్తాయి..

మార్చి 1 నుంచి వస్తు సేవల పన్ను GSTకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మార్చి నుంచి వ్యాపారులు కచ్చితంగా ఈ – ఇన్ వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 కోట్లు ఆ పైన టర్నోవర్ ఉండి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి, దిగుమతులు చేసే వారు కచ్చితంగా ఇ – వే బిల్లులు ఇవ్వాలి..

Related Posts

You cannot copy content of this page