SAKSHITHA NEWS

బస్ డిపో మేనేజర్ ఎమ్మెల్యే కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు

జోగులాంబ-
గద్వాల:-గద్వాల జిల్లా కేంద్రంలో నుతన బస్టాండ్ నిర్మాణం పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ…గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన గద్వాల నియోజకవర్గంలో ఏ రంగంలో కూడా ఏలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్,మంత్రివర్యులు కేటీఆర్, హరీశ్ రావు లా సహాయ సహకారంతో గద్వాల నియోజకవర్గంలో గద్వాల పట్టణంలో ప్రభుత్వపరమైన పలు అభివృద్ధి కార్యక్రమాలలు అన్ని రంగాలలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తీ చేసుకోవడం జరుగుతుంది. బస్టాండ్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు, ప్రయణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులతో అందుబాటులో ఉండేలా త్వరగా పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ బి.యస్ కేశవ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీదర్ గౌడ్, ఎంపీపీ విజయ్ కుమార్, కౌన్సిలర్లు మురళి,నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నరహరి గౌడ్ గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు ‌, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, ఆర్టీసీ ఉద్యోగస్తులు సిబ్బంది, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 16 at 11.46.51 AM 1

SAKSHITHA NEWS