కాంగ్రెస్ లో చేరిన నీలం మధు..
కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి..
పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా..
ఇందిరమ్మ స్పూర్తితో పాలన లో సామాన్యులకు న్యాయం..
ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వర్తిస్తా : నీలం మధు ముదిరాజ్..
ఎన్ ఎం అర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు యువనేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి నీలం మధు ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ భవన్ కి బయలుదేరి ముందు చిట్కుల్ లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో వందలాదికారులతో గాంధీభవన్ కు బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ సంక్షేమo అందించే దిశగా ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ హామీల అమలుకి కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ పాలన అందిస్తామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే దిశగా ముందుకు సాగుతూ ప్రజలందరికీ న్యాయం చేస్తుందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పాలనలో తాను సైతం భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి మరియు సహకరించిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.