రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు

Spread the love

Navratna schemes introduced by the Chief Minister YS Jaganmohan Reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలకు చేరేలా చేయడంలో కీలకపాత్ర పోషించేది సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు మరియు వాలంటీర్లదేనని వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.


సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి(51), ఈపూరు(36), నూజెండ్ల(45), శావల్యాపురం(33) మండలాల మొత్తం నాలుగు మండలాలకు గాను 165 మంది సచివాలయ కన్వీనర్లతో మరియు ఆయా మండలాల వాలంటీర్లలతో వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ ఆత్మీయ సమావేశానికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు , మరియు నియోజకవర్గ పరిశీలకులు జంజనం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మధ్య వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తే, పార్టీకి మరియు ప్రజలకి మధ్య సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు వారదుల్ల ఉంటారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడున్న‌రేళ్ల పాల‌న‌లో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. కులం, మతం, రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రతీ ఒక్కరికీ అందజేసిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివ‌రించారు.

గత ప్రభుత్వ హయాంలో వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిసే విధంగా ప్రతి సంవత్సరం పాంప్లేట్ వేయించి మరీ ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని అన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే, ఇవ్వని హామీలకు సైతం పనులు చేస్తున్నామని అన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాలనకి మధ్య అనేక వ్యత్యాసం వచ్చిందని వినుకొండ నియోజకవర్గం గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్దిలో దూసుకు వెళ్తుందని ఈ అభివృద్దిని చూసి ఓర్వలేక తమ మనుగడ కోల్పోతారనే భయంతో ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై కోర్టులకు వెళ్తూ అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు.

ప్రతిపక్షం అన్నవారు మన ప్రాంతం అభివృద్దికి సహకరించకపోయిన పర్వాలేదు కానీ, అభివృద్దికి అడ్డుపడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీరు ఎన్ని విధాలుగా అడ్డగించిన వినుకొండ అభివృద్దిని ఆపలేరని నా ప్రాణం ఉన్నత వరకు వినుకొండ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా తానూ పనిచేస్తానని అన్నారు.

Related Posts

You cannot copy content of this page