వీణవంక స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబురాలు

Spread the love

వీణవంక స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబురాలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి విద్యార్థులచే పలు ప్రయోగాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం అలవర్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులు లింగయ్య మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ కనుక్కొని ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారత దేశ కీర్తి బావుటాను ఎగురవేసిన సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులు రవికిరణ్ మాట్లాడుతూ నా మతం సైన్సు దానినే జీవితాంతం ఆచరిస్తా అని చెప్పి, తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలో గడిపిన దార్శనికుడు సర్ సివి రామన్ అన్నారు. ఉపాధ్యాయులు రాజశేఖర్ మాట్లాడుతూ ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపణం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితమే రామన్ ఎఫెక్ట్ అన్నారు. ఉపాధ్యాయులు జయపాల్ రెడ్డి మాట్లాడుతూ రామన్ కాంతి పరిక్షేపనం మరియు రామన్ ప్రభావం ఉన్న సృష్టికి సంబంధించిన పరిశోధనలకు గాను 1930లో భౌతిక శాస్త్రంలో సర్ సివి రామన్ కు నోబెల్ ప్రైజ్ లభించింది అన్నారు. విద్యార్థులు ప్రశ్నించడం, పరిశీలించడం, పరిశోధించడం అలవర్చుకొని విజ్ఞాన శాస్త్ర రంగంలో ఇంకా అన్వేషణలు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page