భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు

Spread the love

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్
సాక్షిత : గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు*

డిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డులు అందచేసిన రాష్ట్రపతి
కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో 13 అవార్డులు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రం
9 కేటగిరిలలో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీ లలో అవార్డులు సాధించిన తెలంగాణ
ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రం
అత్యధిక అవార్డులు సాధించిన తెలంగాణ ను అభినందించిన భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అంతకుముందు, అవార్డు గ్రహీతలకు తేనీటి విందు ఇచ్చిన కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్రానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీతలు, అధికారులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు

Related Posts

You cannot copy content of this page