Nai Brahmins should be protected by respecting caste professions – Narsa Reddy Bhupathi Reddy
కుల వృత్తులను గౌరవించి నాయి బ్రాహ్మణులను కాపాడాలి – నర్సారెడ్డి భూపతిరెడ్డి
సాక్షిత : కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ గౌరవ పాదయాత్రలో పాల్గొన్న టిపిసిసి ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులస్తుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటించారు.కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, ఈ పోరాటం చేస్తున్న నాయి బ్రాహ్మణ సోదరులకు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు
.అదే విధంగా ఈ విషయాన్నీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి,ఇతర కులస్థులు ఎవరూ కుడా సలూన్లు ఏర్పాటు చేయకుండా గవర్నమెంట్ ఆర్డర్(G .O) కొరకు వారితో ఒక ప్రత్యెక లేఖను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర.మహిళా కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ఆర్.లక్ష్మి, , నాయి బ్రాహ్మణ సోదరులు రేనయ్య నాయి, పరమేష్ నాయి, శ్రీనివాస్ నాయి, యాదగిరి నాయి, బాలేశ్వర్ నాయి, నరసింహ నాయి, మహేష్ నాయి తదితరులు పాల్గొన్నారు