SAKSHITHA NEWS

కొడుకు.. కోడలు.. చూడడం లేదు నాకు రక్షణ కల్పించండి సారూ….
ఆర్డిఓ కార్యాలయం ముందు బోరునా విలపించిన వృద్దురాలు*

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కోదాడ పట్టణంలో గాంధీనగర్ కు చెందిన సోమపంగు వెంకమ్మ, కోదాడ మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదివి విరమణ పొందింది. ఈ క్రమంలో తనకు ఉన్న ఒక్క గాను ఒక్క కొడుకు, కోడలు బాగోగులు చూడకుండా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం తన కడుపుకి పట్టెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ, కన్నీరు మున్నీరుగా విలపించింది. పదవి విరమణ పొందిన తరువాత, తనకు వచ్చే 35000 పించన్ కూడా తన వద్ద నుంచి తన కొడుకు, కోడలు లాక్కుంటున్నారని, తన పేరు మీద ఉన్న ఎకరం ఇరవై గుంటల (ఎకరన్నరా) భూమిని తోపాటు తన ఇంటిని కూడా తన కోడలే తన పేరు మీదకు బలవంతంగా వ్రాయించుకున్నదని భావోద్వేగానికి లోనయ్యింది.

తన తరుపున మాట్లాడడానికి వచ్చిన తన కుతుర్లపై కూడా కేసులు పెడుతున్నారని, తన తరుపున ఎవరు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళపై కేసులుపెడతామని తమ కోడలు అందరినీ బెదిరిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కోదాడ ఆర్డిఓ కార్యాలయం లో డీఎవో రామకృష్ణ రెడ్డికి, తన గోడును చెప్తూ కాళ్లపై పడి వినతిపత్రం అందజేసింది.


SAKSHITHA NEWS