Municipal workers on strike in front of Tandoor Old Municipal Office
తాండూర్ పాత మున్సిపల్ ఆఫీస్ ముందు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు
తాండూర్ మున్సిపల్ కార్మికుల సమస్యల పై 6 రోజులనుండి పాత మున్సిపల్ ఆఫీస్ ముందు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు. పట్టించుకోని తెరాస ప్రభుత్వం. ప్రజా ప్రతినిధులు. ప్రభుత్వ అధికారులు
వికారాబాద్ జిల్లా తాండూర్ సాక్షిత : తాండూర్ మున్సిపల్ కార్మికులు గత సంవత్సరం కొన్ని నెలలుగా, TRS ప్రభుత్వం,జీతాలు ఇవ్వటం లేదు, జీతాలు ఇవ్వకున్నా కరోనా టైమ్ లో మున్సిపల్ కార్మికులను,దేవుళ్ళని పొగడటమే కానీ,కార్మికుల శాలరీలు ఇవ్వటం లేదని మాకు జీతాలు ఇవ్వకుండ, ఎన్ని నెలలు కడుపులు మాడుచు కొని పనిచేయాలని కార్మికులు నిరుసన వ్యక్తం చేస్తున్నారు
,తాండూర్ పట్టణము లో కోట్ల పన్నులు మున్సిపల్ శాఖప్రతి నెల నెల వాసులు చేయటం జరుగుతుంది, ఆ డబ్బులు తాండూర్ పట్టణములో మురికి కాలువలు, సైడ్రైన్లు శుభ్రం చేసే శాపాయిలకు జీతాలు ఇవ్వటం లో జాప్యం ఎoదుకు జరుగుతున్నదో అర్తం కావటం లేదని, ప్రభుత్వం ఆ శాఖ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదా? అని ఆరోపిస్తున్నారు.
అలాగే 11వ పి.ర్. సి. ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.18మంది కార్మికులను తీసుకోవాలన్నారు. TRS ప్రజాప్రతినిధులు కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన, ప్రజాప్రతినిధులు కానీ,ఇన్ని నెలలు మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేరని ఆ వెధన చెందుతున్నారు.
ఈ ప్రాంత మంత్రి సభిత ఇంద్రరెడ్డి, MLC డా!!పి. పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక MLA రోహిత్ రెడ్డి , మాకార్మిల సమస్యలు పరిస్క రించా లేకపోతున్నారని, ఇప్పటి కైనా,వెంటనే పరిస్కారం చేయాలని కోరుతున్నారు, మాసమస్య లు పరిస్కారం చేసే వరకు సమ్మే చేస్తామని పలువురు కార్మికులు ముక్తా ఖంటం తో తెలియజేశారు