ఆర్చి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదానికి తెరదించాం.
ఇరుపక్షాలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం.
ఇందులో ఏదో కుట్ర జరిగింది. ప్రజల మనోభావాలతో కూడిన ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు.
ఎర్రగొండపాలెం లో కులాల మధ్య, వర్గాల మధ్య వివాదాలు ఎప్పుడూ లేవు.
కావాలనే కొందరు ఇటువంటి వివాదం లేపి లబ్ధిపొందాలని చూశారు.
మూడు రోజులు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చేసిన కృషిని అభినందిస్తున్నా.
భవిష్యత్తు లో ఇటువంటి వివాదాలకు తావివ్వమని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకోవటం శుభపరిణామం.