మునిసిపల్ ఔట్సోర్సింగ్ వారిని పెర్మనెంట్ చేసి జీతాలను పెంచాలి.

Spread the love

మునిసిపల్ ఔట్సోర్సింగ్ వారిని పెర్మనెంట్ చేసి జీతాలను పెంచాలి.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.

కుత్బుల్లాపూర్ మండలం మునిసిపల్ కార్మికుల సమావేశం నేడు షాపూర్ నగర్లోని పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూసుఫ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాన్ని, సమాజాన్ని శుభ్రంగా ఉంచే మునిసిపల్ కార్మికులు నేడు కాంట్రాక్టు ఉద్యోగులగా పనిచేస్తూ అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారని మునిసిపల్ కార్మికులు ఒక్కరోజు పని ఆపివేస్తే మొత్తం సమాజంలో దుర్గంధం వచ్చి రోగాలు వస్తాయని అలా సమాజాన్ని శుభ్రపరిచే కార్మికులను ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని కావున మునిసిపల్ కార్మికులు ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని కోరారు.కనీస వేతనాలను 29 వేలుగా నిర్ణయించి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అన్ని ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తరువాత మాత్రం పట్టించుకోవట్లేదని,బీజేపీ ప్రభుత్వం మునిసిపల్ పనులను కూడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేట్లు పానిచేస్తున్నాయని వీటిని పసిగట్టి కార్మికులు రాబోవు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం,సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ లు మాట్లాడుతూ మునిసిపల్ కార్మికులు 11 మంది పనిచేయాల్సిన చోట ఒక్కొప్రాంతంలో ఒక్కో తక్కువ మందితో పనిచేస్తున్నారని ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ అవేమి పట్టించుకోకుండా ఉన్న కార్మికులతోనే పనిచేపిస్తూ కార్మికులపై పని ఒత్తిడి పెరుగుతుందని,అదేవిధంగా అధికారులు శాస్త్రీయంగా కాకుండా ఒకచోట ఉన్న కార్మికులను దూరం ప్రాంతంలోకి పంపిస్తూ ఆర్థికభారం పెంచుతున్నారని, కొన్నిప్రాంతంలో అధికారులు మునిసిపల్ కార్మికులను ఇష్టమొచ్చినట్లు దుర్భాశలాడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. జీతాల సమయంలో ఆబ్సెంట్ పేరుతో జీతాలు ఇచ్చేటప్పుడు లంచంగా కూడా కార్మికుల నుండీ వసూలు చేస్తున్నారని ఇలా కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని కావున కార్మికులంత ఏఐటీయూసీ జండా క్రింద పోరాటం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు మునిసిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పాటల రూపంలో వివరించి కార్మికులను ఉత్తేజపరిచారు.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ నాయకత్వం వహించగా,ఏఐటీయూసీజిల్లా అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి శ్రీనివాస్ మునిసిపల్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ సంఘం నాయకులు సుధాకర్, పీటర్,సరిత,కమల, చెంచయ్య,నీలమ్మ, సోమలక్ష్మి, రమేశ్ లతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page