SAKSHITHA NEWS

Municipal Commissioner of Kalvakurti who is promoting illegal constructions is a town planner.

అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానర్. ఇంద్రానగర్ కాలనీ కౌన్సిలర్ సైదులు గౌడ్


సాక్షిత ప్రతినిధి. ఇంద్రానగర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లపైన బడా బాబుల కన్ను. బడా బాబులకు సలాం కొడుతున్న ప్రభుత్వ అధికారులు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కటిక పేదవారికి 200 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వడం జరిగింది.

నేటి ప్రభుత్వము ఇచ్చే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇతరులకు అమ్మకుండా కఠిన ఆజ్ఞలు పెట్టిన కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంద్రానగర్ కాలనీలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్లను నేటి ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు ఒక ప్రభుత్వ ఉద్యోగికి సహకరిస్తున్నారు .

దీని మీద కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ స్పందించి ఇట్టి వ్యవసాయ కేంద్ర బ్యాంకులో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి అయిన తిరుపతయ్య కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్. టౌన్ ప్లానర్. 21 వ వార్డు కౌన్సిలర్ సైదులు గౌడ్ అండ దండలతో కల్వకుర్తి మున్సిపాలిటీ నుండి పర్మిషన్ లేకుండా నిరుపేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ ఉద్యోగి తిరుపతయ్య కొని కూలగొట్టి తమ సొంత లాభాల కోసం కొత్తగా అక్రమ భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి సహకరిస్తూ ప్రోత్సహిస్తూ కల్వకుర్తి మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కమిషనర్. 21వ వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ వాటర్ ప్లాంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి తిరుపతయ్య ఇంటికి కల్వకుర్తి మున్సిపాలిటీ నుండి వాటర్ ట్యాంకుల ద్వారా ఇంటి నిర్మాణ పనుల కోసం కల్వకుర్తి మున్సిపాలిటీ నుండి మున్సిపాలిటీ వాటర్ ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది.

ఇట్టి విషయంలో ఒక రిపోర్టర్ గా వెళ్లి కల్వకుర్తి మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసి రెండు నెలలు అవుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ కమిషనర్. టౌన్ ప్లానర్. వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ అసలు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ అధికారులే అక్రమ కట్టడాలకు సహకరిస్తున్నారు అనే అనుమానం వస్తుంది. ఇప్పటికైనా ఇట్టి విషయంలో మున్సిపల్ చైర్మన్ పట్టించుకోని కల్వకుర్తి మున్సిపాలిటీ నుండి పర్మిషన్లు తీసుకోకుండా కడుతున్న కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది.


SAKSHITHA NEWS