పామాయిల్ ఫ్యాక్టరీలో ఫార్మల్ షెడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా

Spread the love

పామాయిల్ ఫ్యాక్టరీలో ఫార్మల్ షెడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా

అశ్వారావుపేట సాక్షిత న్యూస్ : స్థానిక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో సుమారు 15 లక్షల రూపాయలతో రైతుల శ్రేయస్సు కోసం నిర్మించిన ఫార్మర్ షెడ్ ను, పామాయిల్ నర్సరీ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ ను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పామాయిల్ రైతులు ఫ్యాక్టరీ కి గెలలు తీసుకువచ్చే సమయంలో రైతులు కానీ డ్రైవర్లు కానీ ఎక్కడ వేచి ఉండాలో తెలియని పరిస్థితి ఎదురవుతుందని అనేకసార్లు విన్నవించిన ఫలితంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవచేసి 15 లక్షల రూపాయలు వెచ్చించి ఫార్మర్ షెడ్ ను నిర్మించడం జరిగిందన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పామాయిల్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, రైతుల శ్రేయస్సు కోసం మరింత అభివృద్ధికి బాటలు వేస్తామని ఎమ్మెల్యే మెచ్చ అన్నారు. పామాయిల్ నర్సరీ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అశ్వారావుపేట అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, రైతుబంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, అశ్వారావుపేట వైస్ ఎంపీపీ చిట్టూరు ఫణీంద్ర, మందపాటి రాజమోహన్ రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, ఆలపాటి రాము, చీమకుర్తి వెంకటేశ్వరరావు, కొక్కెరపాటి పుల్లయ్య, నారంవారిగూడెం సర్పంచి నారం రాధా, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page