పేద విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ చేయూత

Spread the love

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మియాపూర్ లోని శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ చేయూత

శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సేవలు భేష్

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర కుమారుడు సుమంత్ అనే పేద విద్యార్థికి ఉన్నత చదువులకోసం 25,000/- మరియు మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కి చెందిన గంగభావని అనే పేద విద్యార్థికి ఉన్నత చదువుల కోసం 25,000/- మొత్తం 50,000/- రూపాయలను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అందచేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ రావు .

.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అధినేత సత్యనారాయణ గొప్ప మనసున్న వ్యక్తి అని ని మానవతా దృక్పథంతో పేద విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయంగా ముందుకు రావడం చాలా అభినందనీయం అని , సుమంత్ ఇంజనీరింగ్ విద్యానభ్యసించడానికి గాను   కాలేజీ ఫీజు ల నిమ్మితం ఈ విద్య సంవత్సరంకు గాను 25,000/- రూపాయలను చెక్కు రూపేణా ఇవ్వడం జరిగినది అని, గంగ భవాని కి 25,000/- రూపాయలు మొత్తం 50,000 /- రూపాయలను ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

సమాజ హితం తన వంతు కృషి చేసిన సత్యనారాయణ ని శాలవతో సత్కరించి ప్రత్యేకంగా అభినదించడం జరిగినది .ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఆర్థిక స్థోమత లేక పేదవారు కావడం వలన కాలేజీ ఫీజు కట్టుకోలేని స్థోమత లేకపోవడం  చదువలకు ఆటంకం కల్గకుండా ,విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఇద్దరి భవిష్యత్  కు ఆటంకం కల్గకుండా ,  ఉన్నత  చదువులకోసం స్వంత డబ్బులతో  కాలేజీ ఫీజు కట్టడం జరిగినది అని, చక్కగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ,మరియు ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మంచి భవిష్యత్తు ను ఏర్పరచుకొని ఉన్నత లో స్థిరపడలని ప్రభుత్వ విప్ గాంధీ విద్యార్థులను ఆశీర్వదించడం జరిగినది .

ఎప్పుడు ఏ సహాయం కావల్సిన తన వంతు కృషి  చేస్తానని విద్యార్థులకు చెప్పడం జరిగినది . విద్యార్థులు సత్యనారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పడం జరిగినది ,మంచిగా చదువుకొని ,పది మందికి ఉపయోగపడేలా ఉంటానని ,నా పై చదువులకు ఆర్ధిక సహాయాన్ని అందించిన సత్యనారాయణ ని జీవితం లో ఎప్పటికి మర్చిపోలేనని విద్యార్థి చెప్పడం జరిగినది .

ఈ కార్యక్రమంలో రమణ మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page