SAKSHITHA NEWS

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – ఎంపీపీ

చిట్యాల సాక్షిత ప్రతినిధి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు, చిట్యాల పట్టణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జన ఆరోగ్య సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్య విషయంలో తలెత్తే సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, తమకు అందుబాటులోకి వస్తున్న ఆధునిక వైద్యాన్ని, వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ చికిత్స పొందాలని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రి కి సంబందించిన పలు విషయాలను చర్చించి,తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్, వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ పాపయ్య,గుండ్రాంపల్లి సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ, వైద్యాధికారులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ నరసింహ, ఎంపిటిసిలు పెద్దబోయిన సత్తయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, నీతా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS