SAKSHITHA NEWS

మైనారిటీ పాఠశాల నందు వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట లోని రింగ్ రోడ్ సెంటర్ నందు గల మైనారిటీ గురుకుల పాఠశాల నందు ఈ రోజు 10 వా తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి గారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ప్రతి ఒక్క పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ గురుకుల పాఠశాల లో విద్యను అందిస్తున్నారని, ఈ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే ఒక్కొక్క విద్యార్థికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 119000 వేళ రూపాయలను ఖర్చు చేస్తుందని,మంచి వసతి,నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, అలాగే కిందటి సంవత్సరం 10 వా తరగతి పరీక్షలలో అశ్వారావుపేట మండలంలో 10/10 మార్కులు సాధించిన ఘనత ఈ మైనారిటీ పాఠశాలకే వచ్చిందని, ఆ విద్యార్థిని శాలువాతో సత్కరించి బహుమతి అందజేయటం జరిగిందని, అలాగే ఈ సారి 10/10 వచ్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారితో సన్మానం చెపిస్తామని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో us ప్రకాష్ గారు 10/10 మార్కులు సాధించిన విద్యార్థులకు వాళ్ళ అమ్మా నాన్నల గుర్తుగా 10116-/ రూపాయలు అందజేస్తానని తెలిపారు. అలాగే పాఠశాలలో గల డ్రైనేజీ సమస్యను నిన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి mdo గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలసిందిగా ఆదేశించారని, సమస్య తెలియజేసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా.నాగేశ్వర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .మన ఊరూ మన బడి,కార్యక్రమంతో ప్రతి ఒక్క పాఠశాలలను మెరుగులు దిద్దుతూ, అంగరంగ వైభవంగా పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దటం జరుగుతుందని, అలాగే 10వ తరగతి, చదువే విద్యార్థులు కష్టంతో కాదు ఇష్టం తో చదవాలని,మంచి మార్కులు సాధించి అశ్వారావుపేట మండలానికి, మీ తల్లిదండ్రులకి,ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారు.అనంతరం పాటశాల ఉపాధ్యాయులు ఎంపీపీ గారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు us ప్రకాష్ గారు పాటశాల ప్రధానోపాధ్యయులు సంగీత,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS