MP Jallipalli released free fish fry in many ponds of Ashwaravpet mandal
అశ్వారావుపేట మండలంలోని పలు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన ఎంపీపీ జల్లిపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మొత్తం 8 చెరువులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీలలో భాగంగా ప్రభుత్వం అందించే మొత్తం 10,58,820 ఉచిత చేప పిల్లలను చెరువులలో వదలడం జరిగిందనీ,వాటిలో బొచ్చు- 4,23,528,రోహు- 5,29,410, మ్రిగాల- 1,05,882 రకాల చేపలను మొత్తం 8 చెరువులలో అంకమ్మ చెరువు,1,45,500,అనంతరం ఊర చెరువు,30,000,అసుపాక కోతుల వాగు ప్రాజెక్ట్,24,000, లోతువాగు చెరువు,21,000, పెద్దవాగు ప్రాజెక్టు,6,65,820, గాండ్లగుడెం రాల్లవాగు ప్రాజెక్ట్,40,500, తిరుమల కుంట బోగండానిగండి చేర్వు,90,000,వినాయక పురం దబ్బతోగు ప్రాజెక్ట్ 42,000 చేప పిల్లలను వదలడం జరిగిందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి గారు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మత్స్యకారుల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా మత్స్య కారులకు, ఉచితంగా 100%రాయితితో చేపపిల్లలని అందించటమే కాకుండా, వాటికి కావాల్సిన ఆహారం,మరియు వాటిని పట్టడానికి చెప వలలు,విక్రయించడానికి మత్స్యకారులకు బండ్లు,ఆటోలు,కాటలు అవీ నిల్వ ఉండడానికి కూలింగ్ దర్మకొల్ బాక్స్ లు ఇలా వారికీ కావలసిన ఆన్ని రకాల సదుపాయాలు తెలంగాణ రాష్ట్ర TRS ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది అనీ కావున ప్రతి ఒక్క మత్స్యకారులు ఈ అవకాశాన్ని వినియోగించు కొని అభివృద్ధి చేదాలని ఈ సందర్బంగా ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి గారు కోరారు. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, సర్పంచ్లు సాధు జ్యోత్స్న భాయి,mpo సీత రామరాజు,ఫిష్ కార్పొరేషన్ dfo వీరన్న,ఫీల్డ్ ఆఫీసర్ కోటేశ్వర రావు, మత్స్యకార సొసైటీ సిబ్బంది మంగారాజు,భార్గవ్, అనిల్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.