అందరి సహకారంతోనే ముందుకు: వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల

Spread the love

Moving forward with the cooperation of all: Vikarabad Municipal Chairperson Manjula

అందరి సహకారంతోనే ముందుకు: వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల

అందరి సహకారంతోనే వికారాబాద్ అభివృద్ధి ముందుకు సాగుతుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోనీ తన ఛాంబర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక అవిశ్వాసం విషయానికొస్తే కొందరు కౌన్సిలర్లు తనపై ఆరోపణలు చేస్తూ అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుభిక్షమైన పాలన అందజేసేందుకుగాను నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టడానికి వీలులేదని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని తెలిపారు.

అయితే అందుకు సంబంధించి గవర్నర్ సంతకం పెండింగ్లో ఉన్నప్పటికీ త్వరలో పూర్తికానుందని తెలియజేశారు. ఈ సందర్భంగా తాము అవిశ్వాసం బిల్లుపై కోర్టులో రిట్ పిటిషన్ వేయగా స్టే వచ్చిందని తెలియజేస్తూ మూడు వారాల వరకు అవిశ్వాసం బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇకపోతే తాను విమర్శలను పట్టించుకోనని ప్రజా సమస్యలు, మున్సిపల్ అభివృద్ధి కోసం అందరి సహకారంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page