గౌడ కులస్తుల సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

MLC Shambhipur Raju to allocate space for social needs of Gowda castes

గౌడ కులస్తుల సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దేవేందర్ నగర్ కు చెందిన శ్రీనూతన గౌడ సంఘం కులస్తులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని ఈరోజు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దేవేందర్ నగర్ లో గౌడ కులస్తుల సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, శ్రీనూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గోపాల్ గౌడ్, రవీందర్ గౌడ్, యాదగిరి గౌడ్, ప్రభాకర్ గౌడ్, సత్యప్రకాష్ గౌడ్, రవీందర్ కుమార్, సాయి గౌడ్, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page