సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్ రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కోట్లతో చేపడుతున్న కల్వర్టు మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ , మైనంపల్లి హనుమంత రావు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మరియు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులకు అనుగుణంగా కల్వర్టు నిర్మాణ పనులను పెంచాలని, అందుకు నిధులు అవసరమైతే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 40% పనులు పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ నారాయణ, డిఈ నరేందర్, ఏఈ లక్ష్మీ నారాయణ, స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దూలపల్లి కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యేలు…
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…