గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులైన భర్త నారాయణ గౌడ్ కు గత ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా రైతు బీమా ద్వారా నిరుపేద కుటుంబానికి 5 లక్షలు రూపాయల చెక్కును అందజేశారు.
బిఆర్ఎస్ పార్టీకి , తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్యే కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, సింగిల్ విండో డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలూరు రామయ్య శెట్టి, విజయ్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, నరేందర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.