రూ.1.07 కోట్లతో మాణిక్య నగర్ కల్వర్టు అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే పర్యటన…
సమన్వయంతో పనులు వేగంగా చేపట్టి.. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని మాణిక్యనగర్ (చింతల్) కల్వర్టు అభివృద్ధిపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, హెచ్ఎండబ్లు ఎస్ఎస్ బి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు రూ.1.07 కోట్ల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో చేపట్టవలసిన చర్యలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 20 నుండి పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రస్తుతం అక్కడున్న కరెంటు కేబుల్స్, పోల్స్, వాటర్ లైన్స్ మార్చేలా చర్యలు తీసుకోవాలని, పనులు చేపడుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్లే ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలకు వరద నీరు ప్రస్తుతం ఉన్న కల్వర్టు ఎత్తు తక్కువ ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి, శాశ్వత పరిష్కారం కోసం కల్వర్టు వెడల్పు చేస్తూ చేపట్టనున్న పనుల్లో నాణ్యతతో సకాలంలో పూర్తి చేసేలా సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, ఎస్ఈ చెన్నారెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, వాటర్ వర్క్స్ జిఎం శ్రీధర్ రెడ్డి, డిఈఈ పాపమ్మ, డిజిఎం రాజేష్, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, టిఎస్ పిడిసిఎల్ డిఈఈ శ్రీనాథ్ రెడ్డి, ఏఈ మల్లారెడ్డి, మేనేజర్ అనూష మరియు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, కాలనీ వాసులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.