SAKSHITHA NEWS

పేదలకు మంచి జరగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేటలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంపై అవగాహన సదస్సు

ప్రజల భవిష్యత్తు బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అలాంటి మంచి చేసే నాయకుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అన్న కార్యక్రమంపై అచ్చంపేట సాయిబాబా కళ్యాణమండపంలో మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తీర్చే లక్ష్యంతోనే జగనన్న ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చడానికేనన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్న సురక్ష.. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించేందుకే ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం అని అన్నారు. మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి నెల రోజుల పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, జేసీఎస్ మండల కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు గ్రామాల వారీగా ప్రతి ఇంటికి వెళ్లాలన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో జగనన్న చేసిన మంచిని వివరించి.. వారి మద్దతు కోరాలని సూచించారు. అదే సమయంలో ప్రజలకు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పేదలకు మంచి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అంటే..చంద్రబాబు లాంటి పెత్తందార్లకు కడుపు మంటా ఉందన్నారు. తప్పు చేసి జైలుకెళ్లిన వారు డప్పులు మోగిస్తే బయటకు వస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేసు కోర్టుల పరిధిలో ఉందని.. టీడీపీ వాళ్లు ధర్నాలు, ప్లేట్లు మోగిస్తే నిజాలు అబద్ధాలు కావన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రజల కోసం ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.. అని ప్రశ్నించారు. కానీ సీఎం వైఎస్ జగన్ పాలనలో నవరత్నాలు పథకాలతో ప్రజలే సంతోషంగా ఉన్నారన్నారు. నాలుగున్నరేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎంతోమంది పేదలకు సొంతింటి కల తీర్చిన ఘనత సీఎం జగన్ దేనన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలను, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.


SAKSHITHA NEWS