ప్రారంభోత్సవానికి ఇండోర్ స్టేడియంను సిద్దం చేయండి. ఐఏఎస్

Spread the love

ప్రారంభోత్సవానికి ఇండోర్ స్టేడియంను సిద్దం చేయండి.
*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత : స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలో అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఉదయం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి వినాయక సాగర్ వద్ద నిర్మిస్తున్న మార్కెట్ గదులు, ఇందిరా మైదానం వద్ద నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం పనులు ఆలస్యం గా చేస్తున్నారని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని పనులు పూర్తి అయినా చిన్నచిన్న పనుల్లో ఆలస్యం చేయకుండా పనులు ఈ నెలాఖరు లోపు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలన్నారు. ఈ ఇండోర్ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్, తదితర క్రీడా కోర్టులు ఉంటాయి. వినాయక సాగర్ సమీపంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద నిర్మిస్తున్న మార్కెట్ గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. ప్లాన్ ప్రకారం ఒక్క ఫ్లోర్ అయినా స్లాబ్ వేసి గదులను నిర్మించాలని అన్నారు. అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి. ఈ. విజయకుమార్ రెడ్డి, ఏ ఈ కామ్ ప్రతినిథి అనిల్ తదితరులు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page