SAKSHITHA NEWS

అశ్వారావుపేటకు త్వరలో డిగ్రీ కళాశాల

అభివృద్దే లక్ష్యంగా MLA మెచ్చా

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరును ప్రపోస్ చేసిన – MLA మెచ్చా నాగేశ్వరరావు


సాక్షిత : హైదరాబాద్ వెళ్లిన MLA మెచ్చా నాగేశ్వరరావు పలు అభివృద్ది పనులకు నిధులు తెచ్చారు అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR నీ కలిసిన MLA అశ్వారావుపేట లో చదివే విద్యార్థులు సత్తుపల్లి వెళ్లి డిగ్రీ చదవడం ఇబ్బందీ పడుతున్నారనీ అశ్వారావుపేట లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ మంత్రి మరియు అధికారులను ఆదేశించారు.కాగా ఈరోజు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్న అప్పయ్య,అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ రాంబాబు అశ్వారావుపేటను సందర్శించి కళాశాల ఏర్పాటుకు వసతులు పరిశీలించారు అనంతరం అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు నీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కళాశాల ఏర్పాటుకు సుమారు 10 ఎకరాలు అవసరం ఉండటంతో MRO తో MLA మాట్లాడారు అలాగే కళాశాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా పెట్టాలని MLA మెచ్చా నాగేశ్వరరావు ప్రపొస్ చేశారు.ఈ సందర్భంగా వచ్చిన ప్రిన్సిపాల్ మరియు ప్రోఫిసర్ తెలిపిన వివరాల ప్రకారం అశ్వారావుపేట లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కొరకు వసతులు పరిశీలించాలని తమకు ఉన్నాతాదికారులు ఆదేశించగా సందర్శించారని.అశ్వారావుపేట లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయని. ఈరోజు ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేయ్యనున్నట్లు తెలిపారు.


SAKSHITHA NEWS