ఇచ్చిన మాట నిలబెట్టుకున్న MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

దమ్మపేట

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న MLA మెచ్చా నాగేశ్వరరావు

ఖబరస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించిన MLA మెచ్చా

CSC హెల్త్ కేర్ ఆరోగ్య పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన MLA మెచ్చా

కార్మికులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం

👉 దమ్మపేట మండల కేంద్రంలో నీ హై స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం CSC హెల్త్ కేర్ ఆధ్వర్యంలో తెలంగాణ భావన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంపూర్ణ ఆరోగ్య పరీక్షల కేంద్రాన్ని MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ప్రారంభించారు.అనంతరం వివరాల అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గారు BP పరీక్ష చేయించుకున్నారు.సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండలంలో సుమారు 3542 మంది గుర్తింపు కలిగిన కార్మికులు ఉన్నారని.. దమ్మపేట టౌన్ పరిధిలో సుమారు 600 మంది ఉన్నారని వారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఏమైనా జబ్బు ఉన్నట్లైతే వెంటనే వైద్యం చేయిస్తానని సిబ్బంది తెలిపారు.అలాగే కొత్తగా ఇచే కార్డునీ అందజేసారు.

👉 దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న ఖబరస్తాన్ కి ప్రహరీ గోడ నిర్మించాలని ముస్లింలు గతంలో MLA మెచ్చా నాగేశ్వరరావు గారిని కోరారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు తప్పకుండా ఏర్పాటు చేస్తాననీ హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ ప్రకారం 5లక్షలతో ఖబరస్తాన్ వద్ద ప్రహరీ గోడ మంజూరు చేసి ఈరోజు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఇచ్చిన మాట ప్రకారం ప్రహరీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ముస్లింలు కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల BRS పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,కో ఆప్షన్ సభ్యులు బుడే,సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ దారా యుగంధర్,టౌన్ BRS పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, పగడాల రాంబాబు,సున్నం చిట్టెమ్మ,కౌలురి నాగయ్య,రాంబాబు,అబ్దుల్ జిన్నా, పండురి వీరబాబు,ఆళ్ళ జంగం,ప్రసాద్, కొర్శ వెంకటేష్,ముత్తేశ్వరరావు,ముస్లిం సంగం పెద్దలు దస్తగిరి, గౌస్,వసిం,రహిం,మస్తాన్ వలీ,ఫిరోజ్,యూసుఫ్,స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page