పాదయాత్రలో భాగంగా భగత్ సింగ్ నగర్లో కోటి రూపాయలు వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీ.సీ. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ లో భగత్ సింగ్ నగర్లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 94వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించి కోటి రూపాయలు వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీ.సీ. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు.గడిచిన ఏళ్లలో కాలనీలో కోట్ల రూపాయలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, బస్తి దవాఖాన వంటి మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు గాను ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు,అనంతరం కాలనీలో అభివృద్ధి చేసిన పనులను పరిశీలించి మరియు బస్తి దవాఖాన సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అక్కడవున్న సిబందికి మరియు మెడికల్ ఆఫీసర్కి ఆదేశించడం జెరిగింది .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగత్ సింగ్ నగర్ లో కేటీఆర్ చేతులమేదిగా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ని ప్రారంభించుకోవడం జరిగింది, డివిజన్ లోనే భగత్ సింగ్ నగర్ ని ఎంతో అభివృద్ధి పరిచామని, ప్రస్తుతమున్న స్మశాన వాటికను మోడల్ గ్రేవ్ యార్డ్ గా తీర్చిదిదుతామని హామీ ఇచ్చారు, మిగిలి ఉన్న పనులను కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న భగత్ సింగ్ నగర్ వాసులకు ఏళ్ళ వేళల అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, డి ఈ శిరీష, ఏ ఈ సంపత్, వార్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ జవహర్, బస్తి దవాఖాన మెడికల్ ఆఫీసర్ డా.హరి ప్రసాద్,భగత్సింగ్ నగర్ సంక్షేమ సంగం అద్యేక్షులు కొండల శ్రీనాథ్ రావు, సత్యం,మాజీ మున్సిపల్ చైర్మన్ టి.లక్ష్మ రెడ్డి, జైరాం, మహిళా నాయకులూ శ్యామల, విద్య సుమిత్ర, మంజు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టి అశోక్, కే.రాములు, సాంబయ్య, సామ్రాట్, కాలనీల వాసులు , ప్రజలు పాల్గొన్నారు.