విద్యార్థులు పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

Spread the love

రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – దత్తాత్రేయ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయనగర్ లో గ్రాండ్ ఫార్మా లిమిటెడ్ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా 2 కోట్ల వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భావన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదలతో చదువుకుని విజయాలు సాధించాలని, మన ప్రభుత్వం పేద విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉన్నత విద్యని ఉచితంగా అందిస్తోందని, అలాగే మన నియోజికవరంలో కూడా పేద విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఒకేషనల్ జూనియర్ కాలేజీ, డిగ్రీ మరియు మన జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ని కూడా మన నియోజకవర్గంలోనే ఏర్పాటుచేస్తునం.

అనంతరం దత్తాత్రేయనగర్ కాలనీ తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి చేసినందుకు అలాగే తమ కానీవాసులకు ఎలా వేళల అండగా ఉంటూ తన సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కి అభినందనలు తెలియచేసి ఘనంగా సత్కరించారు,
మరియు తమ కానీవాసులు సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే కే అని తెలియజేస్తూ రానున్న ఎన్నికలలో కె పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని కాలనీ వాసులు అందరు ఏకగ్రీవ తీర్మానంచేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు గ్రాండ్ ఫార్మా లిమిటెడ్ యం.డి శ్రీనివాస్ సాధు , ఎంఈఓ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎంఈఓ రమేష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభ, సీనియర్ నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, రాముడు యాదవ్, అజయ్, వెంకటేష్, అమర్ వడ్ల, మధు,దత్తాత్రేయ నగర్ సంక్షేమ సంఘం అధ్యేక్షులు స్వామి వడ్ల, అడ్వైసర్ యాదగిరి, అశోక్, గోవిందరాజు, ఉత్తరయ్య, శ్రీనివాస్, మహిళా నాయకురాలు సరస్వతి, సావిత్రి, జరీనా, స్థానికులు, సంక్షేమ సంఘ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page