కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి గ్రామం సీతారామాలయ స్వామి ఆలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు ఆర్చ్ పనులకు భూమిపూజ, సూరారంలో నూతనంగా నిర్మించిన శ్రీ కళ్యాణ సీతారామచంద్ర సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర సహిత శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వార్ల విగ్రహ మరియు నవగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠాపన మహోత్సవాలలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల విగ్రహ, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్.
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…