సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గజులారమారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూస్వాముల చేతుల్లో, గడీలలో మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు స్యేచ్ఛను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మహా వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ ని అటువంటి గొప్ప నాయకుడిని ఆయన 373వ జయంతి నాడు గుర్తిస్తూ నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం ఆనందదాయకం అన్నారు. సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటి నాయకులు, సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…